Friday, December 14, 2012

  నాకు  తెలియని బ్రహ్మ జీవిత కాలం 

సమాచారం శ్రీ మద్బాగవతం  నుండి గ్రహించ బడినది 

అంతర్జాలం లో ఈ విషమయం గూర్చి న  సమాచారం కనిపించినా  అంత వివరణాత్మకంగా అనిపించ  లేదు ! 

అందుకనే ఈ పోస్ట్ ! ! !

బ్రహ్మదేవుడు జగత్ సృష్టి కర్త . శ్రీ మహావిష్ణువు సృష్టి రచన ను సంకల్పించినప్పుడు ప్రభవించిన వాడు బ్రహ్మ దేవుడు.  ఈ సృష్టి జరిగే కాలం బ్రహ్మ కు ఒక పగలు.  ప్రళయ కాలం రాత్రి.  

వేయి చతుర్ యుగాలు అనగా కృత లేదా సత్య , త్రేతా, ద్వాపర , కలి యుగాలు కలసి   (ఓక చతుర్యుగము 43,20,000 మానవ సంవత్సరాలు ) బ్రహ్మ  కి ఒక పగలు.  పగలు భూత సృష్టి జరిగి తే రాత్రి కాలం లో సత్య లోకం వరకు గల లోకాలన్నీ   ప్రళయ పయోధి జలాలలో ముణిగి  పోతాయి . రాత్ర్యంతం లో బ్రహ్మ రూపదరుడైన శ్రీ మహావిష్ణువు మేల్కొని తిరిగి సృష్టికి ఉపక్రమిస్తాడు.  ఇలా బ్రహ్మ కాలం  లో  ప్రతి రాత్రి జరిగే ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు.

ఇటువంటి నైమిత్తికప్రలయాలు 360 కలసి బ్రహ్మ కి ఒక సంవత్సరం. అతని జీవితం కాలం నూరు సంవత్సరాలు.  అనగా దీనిని మానవ మానం లోకి మార్చితే . . . . . . .

ఒక సంవత్సరం ఒక రోజు చొప్పున 360 మనవ సంవత్సారాలు దేవతలకి ఒక రోజు. అటువంటి 12000 దేవా మనవ సంవత్సరాలు అనగా ఒక చతుర్యుగం.  ఇటువంటి రెండు వేలు చతుర్యుగాలు బ్రహ్మ కి ఒక పగలు రాత్రి (ఒక రోజు) 360 అహో రాత్రాలు బ్రహ్మ కి ఒక సంవత్సరం.  దీనిని బట్టి మనవ మానం లో బ్రహ్మ జీవిత కాలం  31,10,40,00,00,00,000 సంవత్సరాలు. ఈ జీవిత కాలాన్ని రెండు పరర్దాలు గ విభజించారు.

బ్రహ్మ జీవిత  కాలం అంతం లో ప్రాకృతిక ప్రళయం సంభవించి వ్యక్తావ్య్క్తాత్మిక సమస్తం ప్రక్రుతి లోకి లీనము అయిపోయి, ఆ ప్రకృతి అవ్యక్తము లోకి విలీనం అయిపోతుంది.  అప్పుడి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర కి ఉపక్రమిస్తాడు.

సృష్టి కాలం వలనీ ప్రళయ కాలమ గూడా రెండు పరార్దాలు గడిచిన తరువాత ఏమి లీనటువంటి స్తితి లో చైతన్యం సృష్టించబడి నారాయణ నాభి కమలం నుంచి ఒక అపర బ్రహ్మ ఉదయించి మళ్ళే  సృష్టిక్రమము  మొదలు పెడుతాడు.

 

  1 వ భాగం సమాప్తం ! ! !

తిరిగి మరికొంచం  . . . . . . 2 వ భాగం లో 

  

 


 


 

No comments:

Post a Comment