Friday, December 14, 2012

2 వ భాగం :

ఈ సహస్ర చతుర్యుగ  పర్యాప్తమైన బ్రహ్మ కాలాన్ని పదునాలుగు మన్వంతరాలు గా విభజించారు . ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధిపతి. అనగా పరిపాలనా కాలం.  ఇప్పుడు నడుస్తున్నది 7వ మనువు వైవస్వతుని పరిపాలన లో వున్నాము. మిగతా ఆరుగురి పేర్లు వరుసగా  . . . .
స్వాయంభువుడు, సారోచిషుడు, ఔత్తమి, తామసుడు, రైవతుడు, చాక్షుడు,  ఇందులో ఒక్కకరి పరిపాలనా కాలం 74 1/2 చతుర్యుగాలు కాలం మాత్రమే .

వైవస్వతుని తరువాత మరి ఏడుగురి మనువుల కాలం గడిచిన తరువాత బ్రహ్మ దివాసాతం  లో నైమతిక ప్రళయం సంభవిస్తుంది. వైవస్వతుని తరువాతి మనువుల పీర్లు వరుసగా . . . . 

సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి.  

మనము ఇప్పుడు వర్తమాన బ్రహ్మ జీవితం లోని ద్వితీయ పరార్ధం లో పద్మ (వరాహ) కల్పం అనబడుతున్న ప్రధమ దివసం లో సప్తమ మనువు ఐన  వైవస్వతుని కాలం లో వున్నాము .

వీరి కర్తవ్యం భగవదవతారాల నియమాలననుసరించి ధర్మ రక్షణ, ప్రజాభివృద్ధి  కావించడం.  మనువు సహాయానికి ఇంద్రుడు, సప్తరుషులు ఉద్భావిస్తుంటారు.

చతుర్యుగావసానంలో ప్రతి కలియుగాన్తానికి లోకం లో వేద ధర్మానికి ఆదరువు నశించి వేదాలు కాలగర్భం లో కలసి పోతాయి.అప్పుడు మహర్షులు జన్మించి తపొమూలకమ్గా వేదాలను పునరుధరిస్తారు.  

ప్రతి మన్వంతరం లోను అనగా 76 చతుర్యుగాలు కాలంలోనూ నాలుగు మహా యుగాల పునరావృతి లోను ప్రతి కృత యుగం ధర్మం పరంకాష్టతో మొదలై నానాటికి ధర్మచ్యుతి సంభవించి చివరికి కలియుగం అధర్మ నిలయం అవుతుంది. అప్పుడు తిరిగి భగవానుడు కల్క్యవతారం ధరించి ధర్మాన్ని పునరుద్ధరించి సత్యకాలం తో మళి ఒక చతుర్యుగం ఆరంభం అవుతుంది .

కొన్ని వివరాలు : మొదటి మనువు ఐన స్వాయ్మ్భువుని కాలం లో ధ్రువుని చరిత్ర,కపిలావతారం జరిగాయి. ఆ తోలి రోజులలొ మనుష్య ఆయుర్దాయం చాలా ఎక్కువగా వుండేది.  ఉదాహరణకి ధ్రువుని పరిపాలనా కాల వ్యవధి 30,000 సంవత్సరాలు.  




No comments:

Post a Comment