Wednesday, March 31, 2010

ముగ్గురు మరాటీలు

చాలా రోజుల తరువాత ఒక మంచి చిత్రం చూసాను. ముగ్గురు మరాటీలు.

చిత్రము చూస్తున్నన్త సేపు చాలా హాయిగా అనిపించిది. కెమెరా స్తిరంగా ఉండటము వలన కళ్ళకి శ్రమ అనిపించలేదు (బహుశా అది నిజమైన కారణము కాకా పోవచ్చు). గోవింద రాజుల సుబ్బా రావు, కన్నాంబ గారి నటన అపూర్వము (మాటలు రాక ) ఇకా నాగేశ్వర రావు గారి పాత్ర చాలా చిన్నది అనిపించింది.

క్రొత్త విషయము : అది మంత్ర తంత్రాల తో కూడిన చిత్రము కాబోలు అని అనుకున్న ! కాని అది ఒక జానపద చిత్రమని, నాగేశ్వర రావు గారి కొత్త లో సినిమా రంగానికి వచ్చిన చిత్రమని చుసిన తరువాత తెలిసింది.

ఇంకా ఏమైనా క్రొత్త విషయాలు తెలిసి వుంటే (ఈ చిత్రము గురించి) చదువరులని హ్వనిస్తున్నాను !

Friday, March 12, 2010

చందమామ గురించి చెప్పాలంటే !
ఇష్టమైన వాటి గుఱించి ఎవరు ఏమి చెప్పినా ఇంకా ఇంకా వినాలని పిస్తుంది. . అందుకనీ చందమామ గుఱించి ఎంత చెప్పిన విసుగు అనిపించదు నా అనుభవము లో కూడా కొన్ని సంగటనలు వున్నై !

ఇక్కడ శివ గారు, బ్లాగాగ్ని గారు బ్లాగ్స్ చదివి నాకు చాల ఆనందం కలిగింది. ఎందుకంటే నా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నందుకు, అంటే అర్థం ఇవుంటుంది. నాకు కుడా దాదాపు గ అంతె ఇష్టం ! .

చందమామ ని ఇప్పుడు కొని చదివి భాద పడుతున్నా ! అప్పటి చందమామ ఎక్కడ, ఇప్పుదీ చందమామ ఏమిటి !. కోన కుండా వుండలీను, చదివి భాద పడ కుండా వుండలీను. చందమామ గుఱించి ఒక కద ఒక సీరియల్ బాగుంది అని చెప్పి ముగించాలేము . దాని గుఱించి చెప్పాలంటే !

ఒక్క సారి జ్ఞాపకాల దొంతర లో పరికించితే !

వయస్సు పది సంవత్సరాలు ! ఐదూ తరగతి, చదువు జిల్లా పరిషద్ స్కూల్ , పక్కనీ జిల్లా గ్రందాలయం ! చందమామ పరిచయం అక్కడ జరిగింది. స్నేహితుని బలవంతం మీద (అమ్మ నాన్న అరుస్తారని తెలిసినా ) గ్రంధాలయం కి వెళ్ళాము. కొత్త బాలమిత్ర , బొమ్మరిల్లు ఎవ్వరు పట్టుకోనీ వారు కాదు ! అవి దొరికాయి . కదలు చదువుతుంటే కొంచం కష్టం అనిపించీది అర్ధం కావటానికి. మిత్రుడు చెప్పాడు చందమామ బాగుంటుందని. కాని కొత్త చందమామ దొరకదు. ముందు నెల దీ దొరికింది . కద చదువుతుంటే సాత్వికంగా అనిపించిది. బొమ్మలు హాయి అనిపించాయి . అలా బొమ్మలు చూస్తుంది పోయాను. ఎన్నో సందీహాలు. ఇంటికి వచ్చి వాటి గుఱించి అమ్మని అడిగీవాడిని. పుస్తకం పీరు గుడా సరిగ్గా గుర్తు పెతుకోలేదు. పక్క రోజు గ్రందాలయం కి నాన్న పిలుచుకొని వెళ్లి చందమామ ని చూపించి ఆ పుస్తకం కావాలి , అని అడిగాను. ఆ రోజు సాయంత్రం నాన్న వస్తు క్రొత్త చందమామ తెచ్చాడు. ఆ ఆనందం..... సంతోషం ........ ఆ చందమామ లోని కునీగా సెంటు సువాసన !
అది ప్రారంభం చందమామ తో అనుభందం !

Saturday, February 6, 2010

మంచితనం కనుమరుగు అవుతున్న వేళ !

మంచితనం కనుమరుగు అవుతున్న వేళ !

మాయాబజార్ లాంటి చిత్రాలు రంగులు పులుము కుంటే , ఈ తరం వారికి ఆ సంస్కారం, ఉదాత్తత, పొరుగు వారి తో మెలిగే విధానము, మన్నన అన్ని చూసి విచిత్రం అనిపించవచ్చు ! కాని అవి ఆచరిస్తే ఎంత బాగుంటుంది ? ఒరే (ఈ కాలం భార్య భర్తని పిలిచే సంభోదన !) సంస్కృతి నుండి బయట పడుతుంది ఏమో ?

కనుక పాత చిత్రాలన్నీ రంగులు కావల సిందే . ఒక శ్రీ కృష్ణ పాండవీయం, ఒక సీతా రామ కల్యాణం , ఒక కన్యా శుల్కం ..............

ఆశా కాదేమో ! అవసరము !

Thursday, February 4, 2010

మాయాబజార్ ఎలా వుంది ?

మాయాబజార్ ఎలా వుంది ?
బ్లాగ్ లోకమంతా ఈ మద్య విజయవాడ లో జరిగిన సంఘటన గురించి విచార పడుతుంది ? తద్వారా టీవీ చానెళ్ళ మీద విరుచుకుపడుతుంది . నేను దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ న్యూస్ చానెళ్ళ ని బహిష్కరించాను. ఈ వార్తలు చూసి అసహ్యం వేస్తుంది. కాని మనం వుండే సంఘం గురించిన కనీస వార్తలు తెలుసు కోవాలంటే వార్తా పత్రికలూ ఎలాను వున్నాయి.

ఇక ఈ మధ్య రంగుల లో విడుదల యిన మాయాబజార్ ఎలా వుంది ? చూసిన వాళ్ళు చాలా బాగుంది అని అంటున్నారు. మరి మన బ్లాగ్ లోకం కూయటం లేదు ఎందు కో ?

Wednesday, January 27, 2010

మరి కొన్ని సంగతులు


మరి కొన్ని సంగతులు

30న ప్రేక్షకుల ముందుకు రంగుల "మాయాబజార్"!


హాయ్ హాయ్ నాయిక! మొత్తానికి రంగుల్లో వచ్చేస్తున్నాడు. నలుపు తెలుపు "మాయాబజార్" చిత్రానికి రంగులు అద్దిన వాళ్లకు వేద్దాం రండి రెండు వీరతాళ్లు. ఘటోత్కచుడు ఆరగించిన వివాహ భోజన వంటకాలు, అందాల శశిరేఖ ఆభరణాలు, ప్రతాపాలను నమ్ముకున్న తమ్ముడు అభిమన్యుడి కోసం లోకాలను కకావికలు చేసే ఘటోత్కచుడు అంతా రంగుల్లో కన్పించనున్నారు.

కె.వి.రెడ్డి సృష్టించిన ఈ నలుపు తెలుపు కళా ఖండానికి గోల్డెన్‌స్టోన్ సంస్థ రంగులు అద్దింది. అద్భుతమైన ఈ సినిమాను రంగుల్లో చూసే అందమైన అవకాశం ఈ నెల 30 తేదీన రానుంది. వెండితెరపై శ్రీకృష్ణుడి గెటప్‌లో ఎన్టీఆర్ పంచవర్ణ శోభితంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ సంస్థ విడుదల చేస్తోంది.

సందర్భంగా గోల్డెన్ సంస్థ ప్రతినిధి వాకాడ అప్పారావు ఆదివారం నాడు మాట్లాడుతూ.. 50 నుంచి 60 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. గోల్డ్‌స్టోన్ టెక్నాలజీ, కలర్ టెక్నాలజీ డెవలప్‌చేసి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. జి. జగన్మోహన్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపుదిద్దుకుందని అప్పారావు చెప్పారు.

జగన్మోహన్ మాట్లాడుతూ.. కలర్, సంగీతం ఏమాత్రం తేడా లేకుండా 165 మంది టెక్నికల్ టీమ్‌తో దాన్ని అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. జాతీయస్థాయిలో "మొగల్ ఎ అజామ్" చిత్రం తర్వాత మళ్లీ కలర్‌ఫుల్‌గా వచ్చిన చిత్రమిది. మాయాబజార్‌లో ఉన్న కలర్స్‌ను ఏ చిత్రంలోను వాడలేదు.

నెగెటివ్‌‌గా కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి, అందులో ఏవి పనికి వస్తాయో? ఏవి డామినేట్ చేస్తాయో? అని ప్రతి క్షణం ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసించారు. టెక్నాలజీ అమెరికా ఇచ్చినప్పటికీ ఆంధ్రులే "మాయాబజార్"ను అద్భుతంగా రూపొందించారు.

సినిమాను చూసి అమెరికా కంపెనీలు పది సినిమాల ఆఫర్లు కూడా ఇచ్చారు. మాయాబజార్ కలర్‌గా మార్చడానికి దాదాపు ఐదు కోట్లు ఖర్చైంది. ఇదేదో డబ్బు కోసం ఈ చిత్రానికి పనిచేయలేదు. మన పనివిధానం ప్రపంచానికి తెలియజేయడానికే చేశాం. భవిష్యత్‌లో మరిన్ని విదేశీయులకు చెందిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కూడా కలర్‌ఫుల్ చేసే ఆలోచన ఉంది" అని జగన్మోహన్ వెల్లడించారు.

అలనాటి మేటి చిత్రం 'మాయాబజార్‌' రంగుల్లో తెరమీదకు రాబోతుంది. 53 ఏళ్ల క్రితం బ్లాక్‌ అండ్‌ వైట్‌గా వచ్చిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. కె.వి.రెడ్డి దర్శకత్వంలో, విజయావారి నిర్మాణ సారథ్యంలో 1957 మార్చి 27 'మాయాబజార్‌' విడుదలైంది. ఈ చిత్రంలో నటించిన వారికి, తీసిన దర్శకనిర్మాతలకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. మరి అలాంటి క్లాసిక్‌ చిత్రాన్ని రంగుల్లో చూపితే ఎలా ఉంటుందనే ఆలోచన గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీ అధినేతకు వచ్చింది. దాంతో రంగులు అద్ది ఈనెల 30న విడుదల చేయడానికి సిద్ధం చేశారు. సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదలచేస్తుంది.

వీటి వివరాలను సూపర్‌గుడ్‌ ప్రతినిధి వాకాడ అప్పారావు ఆదివారంనాడు తెలియజేస్తూ..'పాతతరం వారికి మాయాబజార్‌ తెలుసు. నేటి, రేపటి తరానికి కూడా తెలియజేయాలనే సంకల్పమే ఈ ప్రక్రియకు కారణం. 60 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం' అని అన్నారు.

గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ సి.జగన్మోహన్‌ వివరిస్తూ 'విజయవారి చిత్రాల్లో మాయాబజార్‌ నెగెటివ్‌ సంపాదించడానికి రెండు సంవత్సరాలుపట్టింది. యాభైశాతం డామేజ్‌ అయ్యాయి. వాటిని మెరుగు పర్చాలంటే చాలా ఖర్చవుతుంది. 3 గంటల సినిమా 1.20నిముషాలకు కుదించాల్సివస్తుంది.

అందుకే వివిధ ప్రాంతాలనుంచి మాయాబజార్‌ మెటీరియల్‌ను తెప్పించాం. రెండు లారీలలో మెటీరియల్‌ వచ్చింది. వాటినంతా పరిశీలించి ఎక్కడా లింక్‌తెగిపోకుండా తగుజాగ్రత్తలు తీసుకున్నాం. హిందీలో 'మొఘల్‌ ఎ ఆజమ్‌', 'నయాదౌడ్‌' చిత్రాలు రంగుల్లో వచ్చాయి. అందులో కేవలం 65 కలర్స్‌షేడ్స్‌ మాత్రమే ఉన్నాయి. మాయాబజార్‌లో 167లక్షల కలర్స్‌ వాడాల్సి వచ్చింది. మామూలుగా ఆ సినిమాను చూస్తే అరిగిపోయి దారాల్లాగా కన్పిస్తాయి. రకరకాల శబ్దాలు విన్పిస్తుంటాయి. పాటలు జంప్‌ అవుతుంటాయి.

వాటన్నింటి జాగ్రత్తగా పరిశీలించి ఏమాత్రం పాడవుకుండా మళ్ళీ చిత్రం తీస్తే ఎలా ఉంటుందో అలా తీర్చిదిద్దాం. ఇందుకోసం అమెరికాకు చెందిన టెక్నాలజీని ఉపయోగించాం. డి.టి.ఎస్‌. 6.1 వర్షన్‌ ఉపయోగించాం. ఘటోత్కచుడు నడచి వస్తుంటే..ఆ గంభీరం, గధ ఎత్తితే కవచకుండలాలు పలికే శబ్దాలు, సావిత్రి గాజుల సవ్వడి ఇలా ప్రతిదీ తగు జాగ్రత్తతో పొందుపర్చాం. దీనినంతటినీ మన తెలుగువారే 165మంది టెక్నీషియన్స్‌ తీర్చిదిద్దారు. ఈ పని చూశాక అమెరికాకు చెందిన కంపెనీలు తాము చేయాల్సిన రష్యాకు చెందిన 10చిత్రాలను మనల్ని చేయమని అడిగాయి. దాదాపు ఈ చిత్రంకోసం ఐడు కోట్ల రూపాయల వరకు వెచ్చించాం'అని అన్నారు.

అక్కినేని మెచ్చుకోలు

మాయాబజార్‌ను రంగుల్లో చాలా బాగా తీసుకొచ్చారు. కలర్‌ టెక్నాలజీ వచ్చిన కొత్తలో విపరీతమైన కలర్స్‌ వాడి మమ్మల్ని చూపించేవారు. అవి ఇప్పుడు చూస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తుంటాయి. అందుకే మాయాబజార్‌ కలర్‌ అంటే ముందు భయపడ్డా. చూశాక మంచి ప్రయ్నతం చేశారనిపించింది. ముఖ్యంగా డబ్బుకోసం చేసిన సినిమా కాదనిపిం చింది..అంటూ అక్కినేని మెచ్చుకోవడం మరువలేనిదని జగన్మోహన్‌ అన్నారు.

మరో 14 సినిమాలు: శ్రీనివాస్‌

విజయవారి చిత్రాల్లో పాతాళభైరవి, గుండమ్మకథ, మిస్సమ్మతోసహా మొత్తం 14 సినిమాల హక్కులు పొంది రంగులు అద్దనున్నామని గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ చెప్పారు. పాతనెగెటివ్‌లు ఇంకో 5ఏళ్ళలో పాడయిపోతాయి. అవి భద్రంగా ఉంచుకోవడానికే ఈ ప్రక్రియ చేశాం అన్నారు.సూపర్‌గుడ్‌ అధినేతల్లో ఒకరైన ఎన్‌.వి.ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ...ప్రజలు ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుని గోల్డ్‌డైమండ్‌గా ఆశీర్వదిస్తారని అభిప్రాయపడ్డారు. పాత సినిమాల వల్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు...కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయని, విదేశీ చిత్రాల డబ్బింగ్‌లకంటే ఈ చిత్రాన్ని ఎక్కువగా ఆదరిస్తారనే నమ్మకముందని, ఆయన అన్నారు.ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల, కథ,మాటలు, పాటలు: పింగలి నాగేంద్రరావు, డైరెక్టర్‌ ఆప్‌ ఫొటోగ్రఫీ: మార్కస్‌ భార్క్‌లే.

Tuesday, January 12, 2010

శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులందరికీ చందమామ వారి

సంక్రాంతి శుభాకాంక్షలు

Monday, January 11, 2010

ఒక మంచి కథ









ఒక మంచి కథ : ఇది చందమామ లో మే 1953 వచ్చింది చదివి ఆనందించండి