Thursday, December 31, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు

విజ్ఞత కూడిన సందర్సకులందరికి

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఇది మన సంప్రదాయం కాదు, కాని మనము అనుసరస్తున్న కాలమానం యిదీ !
కనుక తప్పనిసరి గా అనుసరిస్తున్నాము.


2010 వ సంవత్సరములో అందరికి మంచి జరగాలని కోరుకుంటూ,

దేవుని చల్లని చూపులతో ఎటువంటి అనర్దాలు కలుగ రాదని ఆసిస్తూ ఈ నూతన టపా !

భగవంతుడు మానవుని మీద ప్రేమ ని తెలిపే చిన్న కధ :
నేను ఒక సారి నదీ తీరము వెంబడి నదుస్తూ వస్తున్నాను నా కస్టాలు తలుచుకుంటూ ! భగవంతుని
దూషిస్తును!

ఒక
సారి వెనుదిరిగి చూసుకుంటే నా కష్ట కాలమంతా ఒక జత అడుగులు మాత్రమీ కనపడుతున్నాయి మిగత సుఖ సంతోష కాలమంతా రెండు జతల అడుగులు కనపడినాయి . భగవంతుడిని అడిగాను, "స్వామి నీవు నన్ను మోసము చేసావు, నా కష్టాలలోను, బాధ లోను ఆదు కుంటావని హామీ ఇచ్చావు", నీవు నన్ను సమయానికి ఆదుకోలేదు."

భగవంతుడు "కుమారా ! నిన్ను అన్ని సమయములందు నేను ఆదు కుంటూనే వున్నాను. నీవు గమనించలేదు",

ఎక్కడ స్వామీ నా నిజమైన కష్ట సమయములందు నన్ను వదలివేసావు. సుఖాల నందు నాతో కలసి నడిచావు . మిగతా కష్ట కాలమంతా నన్ను ఒంటరిగా వదిలి వేసావు. అందుకనీ ఒక సారి రెండు జతల అడుగులు మరి ఒక సారి ఒక జత అడుగులు కనపడుతున్నాయి .

అప్పుడు బాగావంతుడు ఆర్తి గా బిడ్డా ! "నీ కష్ట సమయమందు ఒక జత అడుగులే వుంటానికి ఒక కారణము వున్నది ! సమయమంతా నేను నిన్ను ఎత్తుకుని తీసుకెళ్ళాను !" అవి నా అడుగులే కానీ నీవి కావు "

ఇది ఎంత హాయి గా వున్నది !

1 comment:

  1. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
    ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
    మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
    http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
    ధన్యవాదములు
    - భద్రసింహ

    ReplyDelete