Thursday, December 10, 2009

నాకు నచ్చిన హాస్య కథ

ఇది చందమామ లోది ! కద లో పీర్లు మారినట్టు అనుమానం

ఒక ఊరి లో ఒక సోమరి రంగయ్య ఉండేవాడు. వాడు ఏ పనీ చేసేవాడు కాదు. పైగా అందరిని తన పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వేదించేవాడు. అందరు అతను కనపడంగానే దూరంగా తప్పుకొని పోయేవారు. ఆ ఊరి వారి కి రంగయ్య అంటే చాల కోపంగా వుండేది. కాని సమయము లేక అతనితో వాదించే వారు కాదు.

ఇలా జరుగుతూ ఉండే సమయంలో ఒక రోజు మన రంగయ్య కి ఎవరు కనపడ లేదు. ఏమి చెయ్యాలో తోచక అలా ఊరు దాటి అడవి లోకి పోయాడు .అక్కడ కొంత మంది గొర్రెలు కచుకొనే పిల్లవాళ్ళు కనపడ్డారు.

అబ్బ, దొరికారు ఈ రోజు కి అనుకోని వారి దగ్గరకి వెళ్ళాడు. ఆ పిల్లలంతా రంగయ్య ని చూడంగానే దూరంగా పారిపోయ్యారు. కాని ఒక్క గోపి అనే పిల్లవాడు అలాగే ధైర్యంగా నిలబడి తన పని చేసుకొంటున్నాడు. గోపి కి కుడా రంగయ్య అంటే కోపం . రంగయ్య గోపి దగ్గర కి వెళ్లి ప్రశ్నలు వెయ్యటం మొదలు పెట్టాడు.

ఏమి గోపి చేస్తున్నావు అని అడిగాడు రంగయ్య.
పసువులను కాస్తున్నాను అన్నాడు గోపి
ఈ పశువులు రోజు కి ఎంత గడ్డి మేస్తాయి అడిగాడు రంగయ్య
తెల్లవ, నల్లవా ? అని అడిగాడు గోపి
తెల్లవి ఐతే ఎంత మేస్తాయి ? అని అడిగాడు రంగయ్య .
ఐదు కిలో లు,
మరి నల్లవి ఐతే ?
అవి కుడా ఐదే అన్నాడు గోపి
సరే, ఎన్ని పాలు ఇస్తాయి ? . అన్నాడు రంగయ్య
తెల్లవా ! నల్లవా ! అడిగాడు గోపి
రంగయ్య తిక్క రేగింది ! తెల్లవి ఐతే ఎన్ని ఇస్తాయి ? అని అడిగాడు
ఐదు లీటర్లు .
నల్లవి ఐతే ?
అవి ఐదే !
దాంతో రంగయ్య కి చిర్రెత్తుకొని వచ్చింది.
ఓరి పిల్ల వెదవ నీకు కూడా నేను వెర్రి వెధవలా కనిపిస్తున్నానా అని పట్టుకొని కొట్టడానికి దగ్గరకి వచ్చాడు. గోపి తప్పించుకొని పారి పోతూ నాకేంటి ఊళ్ళో నాతొ సహా సగం మందికి నీవు అలా నే కనపడుతున్నావు. అని పరుగు పెట్టాడు. రంగయ్య ఇక ఉండబట్టలేక పెద్దగా మిగతా సగం మంది కి ? అని అడిగాడు

వాళ్ళ కి గూడా వెర్రి వాడవే అని పారి పొయ్యాడు.

1 comment:

  1. నమస్కారం రమణ శర్మగారు... మంచి కథ అని వెతుకుతుంటే మీ బ్లాగ్ ఇలా కనిపించింది.. మీ బ్లాగ్ పేరు ఆకట్టుకుంది, దానితో మీ బ్లాగ్ చదివాను,మీ మనసు నచ్చిన దాన్ని వ్రాశారానిపించింది.. మీ బ్లాగ్ మల్లెమాల లా లేదు....అరవ్చిన మల్లెలు అరచేత అందుకున్నట్లు ఉంది......(ramadevi,www.beditor.com)

    ReplyDelete